
DNews: 18 Dec: వైఫై సేవలను అందించే బెంగళూరుకు చెందిన ‘డబ్బా’ అనే కంపెనీ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. పీఎం-వాణి (ప్రధాన మంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) పథకం అమలులో భాగంగా, కేవలం ఒక్క రూపాయి నుంచే ఇంటర్నెట్ ప్యాక్‌లను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సామాన్యులకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ పథకం ద్వారా ఎవరైనా తమ ప్రాంతంలో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ పంపిణీదారులుగా మారవచ్చు. గత సంవత్సర కాలంలో, డబ్బా నెట్‌వర్క్ అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో 73,128 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసింది.
