
DNews Dec18 2025:హైదరాబాద్: తెలంగాణలో బిఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం (డిసెంబర్ 17, 2025) కీలక తీర్పు ఇచ్చారు. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లలో ప్రాథమికంగా ఐదుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న పిటిషన్లను కొట్టివేస్తూ, వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మందిపై ఒకేసారి కాకుండా, దశలవారీగా తీర్పు ఇవ్వడం ద్వారా న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్పీకర్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆధారాలు లేని కేసులను ముందుగా తేల్చడం ద్వారా కోర్టు గడువును పాటిస్తున్నట్లు చూపడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
