
DNews Dec18 2025:ఖమ్మం: ఖమ్మం జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉక్కుపాదం మోపారు. జిల్లా అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, మత్తు పదార్థాల రవాణాపై ఉదాసీనంగా ఉండవద్దని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. “ఖమ్మం గడ్డపై గంజాయి అనే మాటే వినిపించకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.
మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం తెలిస్తే సామాన్య ప్రజలు సైతం పోలీసులకు ధైర్యంగా సమాచారం అందించాలని మంత్రి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఖమ్మంను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడమే తన రాజకీయ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
