
DNews Dec17 2025: ముంబై: కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కార్మికులను ఆదుకుని ‘దేశం మెచ్చిన హీరో’గా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్, తన సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. తాజాగా తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా దేశంలోని నిరుపేద మహిళల కోసం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
500 పైగా సర్జరీలు ఆర్థిక స్తోమత లేక క్యాన్సర్ చికిత్సకు దూరమవుతున్న 500 మంది మహిళలకు సోనూ సూద్ ఫౌండేషన్ ఉచితంగా శస్త్రచికిత్సలు మరియు రేడియేషన్ చికిత్సను అందించింది.దేశవ్యాప్త సేవఈ సేవలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు కూడా అందాయి.వైద్య బృందానికి కృతజ్ఞతలు ఈ మిషన్లో పాలుపంచుకున్న వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది మరియు కేసులను గుర్తించడంలో సహాయపడిన వాలంటీర్లకు సోనూ సూద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
