
DNews: 11 Dec: భారత రూపాయి మరోసారి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. గురువారం రూపాయి విలువ 90.4675కు పడిపోయింది, డిసెంబర్ 4న నమోదైన 90.42 రికార్డును అధిగమించింది. రూపాయి విలువ పతనం, ముఖ్యంగా కీలకమైన 90 మార్కును దాటి పడిపోవడం ఆర్థిక రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
2025లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 శాతానికి పైగా క్షీణించింది. 31 ప్రధాన కరెన్సీలలో టర్కిష్ లిరా మరియు అర్జెంటీనా పెసో తర్వాత ఇది మూడవ బలహీనమైన కరెన్సీగా నిలిచింది. డాలర్ బలం 7 శాతానికి పైగా తగ్గినప్పటికీ రూపాయి పతనం కొనసాగడం గమనార్హం. ఈ పరిస్థితులపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిగుమతులు, ఎగుమతుల మధ్య భారీ వ్యత్యాసం, కంపెనీలు తమ చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున డాలర్లను కొనుగోలు చేయడం, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల డాలర్లకు పెరిగిన డిమాండ్ ఈ పతనానికి ప్రధాన కారణాలు. మరోవైపు, అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో జాప్యం.. ఇది మార్చి 2026 నాటికి పూర్తి కావచ్చనే వార్తలు కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
