DNews: Dec 10: పరిగి: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 20 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, ఉచిత బస్ సౌకర్యం, గ్యాస్ సిలిండర్లు, రుణ మాఫీ, రైతు భరోసా, చిన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు పేదలకు చేరుతున్నాయని చెప్పారు. పరిగి మీదుగా రైల్వే ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని, త్వరలోనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana