DNews: Dec 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన OU విద్యార్థుల కోసం రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. అదనంగా, విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు రూ.45 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద “సర్వం సిద్ధాన్” పేరుతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వరాజ్య ఆకాంక్షను బలంగా వ్యక్తపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి OUకి వచ్చానని, గతంలో తాను ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉందని గుర్తుచేశారు. OUకి రావడానికి ధైర్యం అవసరం లేదని, విద్యార్థుల హృదయాల్లో ఉన్న అభిమానమే తనను ఇక్కడికి తీసుకువచ్చిందని తెలిపారు. మేధావుల సూచనలు, సలహాలతో OUని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే సంకల్పంతో వచ్చానని స్పష్టం చేశారు. విద్యార్థుల పక్షాన తన ప్రభుత్వం నిలబడాలని తాను OUకి వచ్చానని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటని, గొప్ప చరిత్ర కలిగినదని ఆయన వివరించారు. OUకి రావడం ధైర్యం కాదు, అభిమానమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో తాను చదువుకోకపోయినా ఆధిపత్యాన్ని సహించబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana