DNews: Dec 10: అచంపేట్ న్యూ టౌన్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రదర్శనలో నల్లమల ప్రాంతానికి చెందిన బాల్మూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న పదో తరగతి విద్యార్థి గగన్‌చంద్ర ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు సీతారాం మార్గదర్శకత్వంలో అతను 2024లోనే ‘త్రీ ఇన్ వన్ సైకిల్’ను రూపకల్పన చేశాడు. ఈ ఆవిష్కరణతో గగన్‌చంద్ర జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. హైదరాబాదులో ఈ నెల 8న ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సమ్మిట్‌లో సైకిల్ ప్రదర్శనకు పెట్టగా, సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించి, ఇది సౌరశక్తి, ఈవీ బ్యాటరీ ద్వారా రోజులో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, మొబైల్ డిస్‌ప్లే ద్వారా సాధారణ సైకిల్‌లా ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించబడిందని ప్రశంసించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి పరిశీలించి తయారీకి కావలసిన సమయం, ఖర్చు, వినియోగం గురించి తెలుసుకున్నారు. కమిషనర్ క్షితిజా గగన్‌చంద్రను భవిష్యత్తులో కార్లు మరియు ఇతర వాహ.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana