DNews: Dec 10: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కల నిజం కావడానికి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ చేపట్టిన 11 రోజుల నిరాహార దీక్షే ప్రధాన కారణమని తెలిపారు. జల్లెలగూడ, మీర్పేట్ సర్కిల్‌లోని చందాచెరువు కట్ట వద్ద విజయ దీక్షా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గులాబీ బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. డిసెంబర్ 9, 2009న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం స్వయంగా కెసీఆర్‌కు ఫోన్ చేసి రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేసి, ఆ హామీతో కెసీఆర్ తన నిరాహార దీక్షను విరమించుకున్నారని సబితా రెడ్డి తెలిపారు. ప్రస్తుత పాలకపార్టీ నాయకులు కెసీఆర్ దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తగదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి కెసీఆర్ కారణమనే విషయం ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా ఒక సత్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బడంగ్‌పేట్, మీర్పేట్ సర్కిల్ అధ్యక్షులు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంపాపేట్ డివిజన్‌లోని రెడ్డి కాలనీలో ఉన్న దివ్యాంగుల హాస్టల్‌లో బీఆర్‌ఎస్ యువనేత గండికోట శ్రీనాథ్ ఆధ్వర్యంలో విజయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మనీష్, యశ్వంత్, కోమల్, భాను, సాయి, శివశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana