
DNews: Dec 03: జగిత్యాల జిల్లా మలయాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన బేటాల ఆలయాన్ని కూడా దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ నిర్శర్త క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కొండగట్టులో జరిగిన ప్రమాదంలో బాధితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
