DNews: Dec 03: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్‌లో కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. తెలంగాణ భవిష్యత్‌ దిశగా ముందుకు సాగుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోందని వివరించారు. ఈ క్రమంలో అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్‌ ప్రణాళికలను విశ్లేషిస్తూ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. నితి ఆయోగ్ సూచనలు, నిపుణుల ఆలోచనలతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana