
DNews: Dec1: ఆంధ్రప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను పూర్తిగా పక్కనపెట్టి, ప్రజా సమస్యలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ ఆమె సోషల్ మీడియా ద్వారా విమర్శల వర్షం కురిపించారు.
ప్రభుత్వం అప్పులపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో ‘సోమవారం – పోలవరం’ నినాదం బలంగా ఉండేదని శ్యామల గుర్తుచేసుకున్నారు. అయితే, ప్రస్తుత పాలనలో ఆ ‘సోమవారం’ కాస్తా సంతకు పోయిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ‘మంగళవారం – అప్పుల వారం’గా మారిపోయిందని సెటైర్లు వేశారుఅభివృద్ధి ప్రాజెక్టులను విస్మరించి, అప్పులు చేయడంపై మాత్రమే దృష్టి సారించిందని ఆమె విమర్శించారు.
ఎంపీలకు సవాల్.. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండగా, సంకీర్ణ ఎంపీలకు శ్యామల సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలని ఆమె కోరుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వంటి అంశాలపై పార్లమెంటులో పోరాడతారో లేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె తన ట్వీట్‌కు “#failedkutami” అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను ట్యాగ్ చేశారు.
