
DNews: Nov 28: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రివారి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆయన ఆరు రోజుల పాటు ఆరు జిల్లాలను సందర్శించనున్నారు. డిసెంబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కోఠగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం రాబోయే పంచాయతీ ఎన్నికలు కావడం విశేషం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 11న, రెండవ దశ డిసెంబర్ 14న, మూడవ దశ డిసెంబర్ 17న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
