
DNews: Nov 28: భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటిల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థాన అధికారులతో ఉత్తర గోపురం వద్ద, కల్యాణ మండపంలో ఏర్పాటు చేయాల్సిన అధ్యయన వేదిక, విభాగాల వారీగా నిర్వహణ, భక్తుల సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌తో పాటు భద్రాద్రి దేవస్థానం ఈఓ కె. దామోదరరావు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ వి. రవీంద్రనాథ్, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవాని, రామకృష్ణరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
