DNews: Nov 26: లఖ్నౌలో జరిగిన మీరట్ బ్లూ డ్రమ్ కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను క్రూరంగా హత్య చేసింది. ఆమె భర్తను ముక్కలు చేసి నీలి డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో మూసివేసింది. చివరికి ఇద్దరు నిందితులు జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న సమయంలో ముస్కాన్ గర్భవతి అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ సౌరభ్ పుట్టిన రోజునే జన్మించింది. ఆ చిన్నారికి “రాధా” అని పేరు పెట్టారు. అయితే సౌరభ్ రాజ్‌పుత్ తల్లిదండ్రులు ఆ బిడ్డను వారసురాలిగా అంగీకరించడం లేదు.

ప్రస్తుతం ఆ బిడ్డ జననం చుట్టూ వివాదం చెలరేగింది. సౌరభ్ కుటుంబ సభ్యులు DNA పరీక్షలు జరిపి ఆ బిడ్డకు తండ్రి ఎవరో నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. సౌరభ్ సోదరుడు రాహుల్ DNA పరీక్షల కోసం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు జైలు అధికారులు మీడియాకు తెలిపారు. సౌరభ్ తల్లి కూడా DNA పరీక్షల వైపు మొగ్గుచూపుతూ, ఫలితాల ఆధారంగా మాత్రమే ఆ బిడ్డను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

శిశువు గురించి జైలు అధికారులు మాట్లాడుతూ, “ఆ బిడ్డ తల్లితో కలిసి మహిళల బ్యారక్‌లో ఉంటుంది. ఆరు నెలల వయసు వచ్చే వరకు అక్కడే ఉంటుంది. జైలు అధికారులు ఆమెకు బట్టలు, ఆహారం, మందులు అందిస్తారు” అని తెలిపారు. ముస్కాన్ తన బిడ్డను సౌరభ్ పుట్టిన రోజునే పుట్టేలా ప్లాన్ చేసిందనే వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు స్పష్టతనిచ్చారు. “డాక్టర్లు ఇచ్చిన డెలివరీ తేదీ అదే. ఆ రోజునే ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు చెప్పిన తేదీకి ప్రసవం జరగడం చాలా అరుదు” అని వారు పేర్కొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana