
DNews: Nov 26: భువనగిరి జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను సిబ్బంది క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు వీడియో వ్యూయింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో మాలి కృష్ణారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
