DNews: Nov 20: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారం లోని రాష్ట్రపతి నిలయం చేరుకుని, సాయంత్రం 4.00 గంటలకు అక్కడ నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 6.15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి ముర్ము రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు.

శనివారం, నవంబర్ 22న ఉదయం 9.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి బయలుదేరుతారు. అక్కడ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిమితులు విధించారు.

ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వపన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అంగని సత్య ప్రసాద్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ తదితరులు నవంబర్ 19, బుధవారం జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana