DNews: Nov 19: దిల్లీ: రాష్ట్ర పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై స్పందించారు. దిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రోడ్లపై పేరుకుపోయే ధూళి మరియు వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా దిల్లీలో అనేక ప్రాంతాల్లో కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించినట్లు చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సిర్సా, దిల్లీలో సుమారు 62 హాట్‌స్పాట్‌లను గుర్తించామని తెలిపారు. వీటిని నియంత్రించగలిగితే కాలుష్యం మరింత తగ్గుతుందని చెప్పారు.

ఈ సందర్భంలో దిల్లీ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. కాలుష్యాన్ని ఎదుర్కొనే ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన గాలిని అందించేందుకు ఈ యుద్ధంలో తమతో కలిసి పోరాడాలని కోరారు. కాలుష్యానికి కారణాలు ఏమిటన్న విషయంపై తమ ప్రభుత్వం పరిశోధనలు చేస్తున్నదని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana