DNews:18 NOV:హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన భారీ దొంగతన కేసులో కీలక పురోగతి నమోదైంది. సుమారు నెలరోజుల తరువాత, ఈ కేసులో ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు మైనర్ అని అధికారులు తెలిపారు.మంగళవారం ఉదయం కొత్తగూడ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారు:రాజ్ మనోహర్ పవార్ (22) – గుజరాత్, రితిక్ మోహితే (24) – మధ్యప్రదేశ్ (న్యాయ విద్యార్థి), 16 ఏళ్ల మైనర్ బాలుడు ఇంకా మిగిలిన ముగ్గురు నిందితులు — దినేశ్ మెహితే, అరుణ్ మోహితే అలియాస్ కలూ, విలాస్ చోహన్ — పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

దొంగల గ్యాంగ్ నగర శివార్లలోని కాలేజీలను టార్గెట్ చేసేది. అక్టోబర్ 10న గూగుల్ మ్యాప్ ద్వారా బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీని గుర్తించి, రాత్రి అర్థరాత్రి వరకు చెట్ల పొదల్లో దాక్కుని మకాం వేశారు. తరువాత కాలేజీలోకి చొరబడి, అల్మారాను పగులగొట్టి అందులో ఉన్న ₹1.07 కోట్ల నగదును అపహరించారు.తర్వాత ఆ డబ్బును ఆరుగురూ ₹17.8 లక్షల చొప్పున పంచుకున్నారు.రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలించారు. చివరికి ముగ్గురు నిందితులు కొత్తగూడ ఎక్స్ రోడ్డులో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ₹37.05 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం శోధన కొనసాగిస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana