
DNews: 8Nov: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం దశ తిరిగింది. చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో.. కుప్పానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి. కుప్పంలో ఒకే ప్రాంతానికి పెట్టుబడులు పరిమితం కాకుండా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్లాన్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో మాట్లాడారు. సకాలంలో పరిశ్రమలు ప్రారంభించాలని ఆయన సూచించారు. కుప్పంలో రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి, ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చింది.
