DET:OCT31:
ఆస్క్ ఎస్ఆర్కేసెషన్‌లో షారూఖ్ ఖాన్:
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇటీవల X లో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన తన తదుపరి చిత్రం కింగ్ గురించి మాట్లాడారు,అభిమానులు అడిగిన ప్రశ్నలకు చమత్కారమైన జవాబులు ఇచ్చారు.షారూఖ్ ఖాన్ త్వరలో 60వ పుట్టినరోజు జరుపుకోనుండగా,ఆయన తన అభిమానులను అలరించేందుకు ఈ సెషన్‌ను నిర్వహించారు.

కింగ్ సినిమాపై షారూఖ్ ఖాన్ తుది హెచ్చరిక:
కింగ్ సినిమా గురించి ఓ అభిమాని అడుగుతూ,సర్,పఠాన్ కోసం సీట్‌బెల్ట్ బిగించాం,జవాన్ కోసం కట్లు కట్టుకున్నాం,మరి ఈ కింగ్ కోసం ఏం చేయాలి?అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు షారూఖ్ తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు.అబ్ సబ్ ఖులా ఛోడ్ దొ..అంటూ తుది హెచ్చరిక ఇచ్చారు.ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.కింగ్ అనేది భారీ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది.

టీజర్ విడుదలపై కీలకమైన అప్‌డేట్:

అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కింగ్’ టీజర్ విడుదలపై కూడా షారూఖ్ ఖాన్ ఒక కీలకమైన అప్‌డేట్‌ను ఇచ్చారు.నవంబర్ 2న షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల అవుతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయమై ఓ అభిమాని టీజర్ పంపాలని అడగగా, అభీ టైటిల్ తో అనౌన్స్ కియా నహీ ఆఫీషియల్లీ… తుమ్ టీజర్ పర్ కైసే పహంచ్ గయే!అంటూ షారూఖ్ తెలివిగా సమాధానం ఇచ్చారు.

ముందుగా టైటిల్ ప్రకటన:
షారూఖ్ ఖాన్ సమాధానం ప్రకారం,కింగ్ సినిమాకు సంబంధించి మొదటగా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది,ఆ తర్వాతే టీజర్ విడుదల అవుతుందని స్పష్టమవుతోంది.పుట్టినరోజు నవంబర్ 2 సందర్భంగా ఏదైనా పెద్ద అప్‌డేట్ ఉంటుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా నటించబోతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana