DNews:OCT 30:హైదరాబాద్: భాగ్యనగరంలో దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్‌లో ఓ పాన్ షాపు యజమానిని గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

మోషిన్ అనే యువకుడు గౌస్ నగర్‌లో హెచ్‌కేజీఎస్ పేరుతో పాన్ షాపును నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి, ముగ్గురు వ్యక్తులు అతని షాపు వద్దకు వచ్చారు. వారు కత్తులు బయటకు తీసి, మోషిన్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ మోషిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలను సేకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హంతకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు మోషిన్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana