
D News: Oct 2: ఏపీఈఏపీసెట్-2026లో క్రీడాకోటా కింద మొత్తం 95 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు కన్వీనర్ తెలిపారు.
అర్హత పొందిన 95 మందిలో 88 మంది చివరి విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నట్లు అక్టోబరు 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ అనంతరం, ఎంపికైన వారు అక్టోబరు 5న తమకు కేటాయించిన ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కన్వీనర్ సూచించారు.
