D News: Oct 4: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,477 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సంక్షిప్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి పే లెవల్ 5, 6 ప్రకారం వేతనాలు అందజేస్తారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు, అర్హతలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.