DET:SEP19

హుమా ఖురేషికి ‘ఫేస్ ఆఫ్ ఆసియా’ అవార్డు:
బాలీవుడ్ నటి హుమా ఖురేషి అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోయింది. ప్రతిష్టాత్మకమైన బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఆమె ‘ఫేస్ ఆఫ్ ఆసియా’ అవార్డును గెలుచుకుంది. ఈ వార్తతో ఆమె అభిమానులు, చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.

‘బయాన్’ సినిమా ప్రదర్శన
హుమా ఖురేషి నటించిన ‘బయాన్’ అనే సినిమా బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఆమెకు ఈ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న తర్వాత హుమా చాలా ఎమోషనల్‌ అయ్యింది. తన విజయాన్ని కలలు కనే ప్రతి చిన్నారికి, ముఖ్యంగా అస్సలు సాధ్యం కాదన్న వారికి అంకితం చేస్తున్నానని చెప్పింది.

అవార్డు అందుకున్న సందర్భంగా హుమా స్పందన
ఢిల్లీలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాకు, ఒక నటి కావాలని కలలు కనడం సాధ్యం కాదని చాలామంది చెప్పారు. అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవార్డు అందుకోవడం నాకోసం మాత్రమే కాదు, నాలాంటి కలలు కనే ప్రతి ఒక్కరికోసం” అని ఆమె తన ప్రసంగంలో తెలిపింది. హుమా ఖురేషి ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘బద్లాపూర్’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ‘మహారాణి’ వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

అవార్డు
ఈ అవార్డు హుమా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఇది భారతీయ సినిమా ప్రపంచానికి దక్కిన మరో గౌరవమని అందరూ ప్రశంసిస్తున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana