
DNews: 10 Dec: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వంగా వచ్చిన భూమి రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100గా చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి రూ.10 లక్షల కంటే తక్కువ విలువైన వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు రూ.100 మాత్రమే వసూలు చేస్తారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వంగా వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుంది..
ఈ మేరకు ఏపీ రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేసి, సాఫ్ట్‌వేర్‌ను నవీకరించారు. రూ.10 లక్షల కంటే తక్కువ విలువైన వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు రూ.100 మాత్రమే వసూలు చేయాలని కూడా ఆదేశించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయని, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఏపీ రెవెన్యూ మంత్రి తెలిపారు.
వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే రూ.100 రుసుము చెల్లించాలని మంత్రి సత్య ప్రసాద్ వివరించారు. రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూమి మార్కెట్ విలువ ఎకరానికి రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
