
‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు అభిషాన్ జీవింత్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో కలిసి ఓ కొత్త సినిమాలో నటిస్తున్నాడు.
గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ. బాలమురుగన్ నిర్మిస్తున్నారు. శివానీ నాగారం కథానాయికగా నటిస్తుండగా.. యోగలక్ష్మీ, వినోద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్రబృందం తాజాగా అధికా
రికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి ‘పికాసో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. “పికాసో.. అందరూ ఇష్టపడేలా మారుతుంది” అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
పోస్టర్లో చుట్టూ బాంబు పేలుళ్లు జరుగుతున్నా ఏమాత్రం బెదరకుండా సీమ టపాకాయలు నోట్లో పెట్టుకుని ధీమాగా కూర్చున్న శివరాజ్‌కుమార్, అభిషాన్ లుక్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ డిజైన్‌ను బట్టి సినిమా యాక్షన్‌తో పాటు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
శివరాజ్‌కుమార్ వంటి సీనియర్ స్టార్, అభిషాన్ జీవింత్ వంటి యువ నటుడు కలిసి నటిస్తుండటంతో ‘పికాసో’పై ఇప్పటినుంచే అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
