
DNews:04 NOV:హైదరాబాద్ రాష్ట్ర మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక శాఖలను కేటాయించింది. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజులకే ఆయనకు శాఖలు కేటాయించడంతో రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరి
రేవంత్ – అజారుద్దీన్ మధ్య చర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించింది. అయితే, అజారుద్దీన్ తనకు హోం శాఖ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు సమాచారం. “హోంశాఖ ముస్లింకు ఇస్తే మైనార్టీలు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకుంటారు” అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖ తన వద్దనే ఉంచుతానని స్పష్టం చేసి, అజారుద్దీన్‌కు మైనార్టీ వెల్ఫేర్ మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రాధాన్య శాఖలు ఇవ్వబోవనని కూడా ఆయన స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
🔹 మంత్రి అజారుద్దీన్ శాఖలు:
- మైనార్టీ సంక్షేమ శాఖ
- పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ
