
DNews:26 Dec: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.బాన్సువాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళను, కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్ రెడ్డి గత నెల రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. దేవేందర్ రెడ్డి వేధింపులు మితిమీరిపోవడంతో, బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది.
గురువారం సదరు మహిళను దేవేందర్ రెడ్డి మళ్లీ వేధిస్తుండగా, ఆమె భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త మరియు కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవేందర్ రెడ్డిపై ఈ క్రింది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్లు.ముందుగా రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ, బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. రాజకీయ అండదండలతో ఇలాంటి పనులకు పాల్పడటంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
