DNews:2 NOV:దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (JEE మెయిన్‌) 2026 ఫస్ట్‌ సెషన్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అక్టోబర్‌ 31 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అభ్యర్థులు నవంబర్‌ 27, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు

JEE మెయిన్‌కు అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లోనే దరఖాస్తు చేయాలి. ఫీజు చెల్లింపుకు కూడా నవంబర్‌ 27, 2025నే చివరి తేదీగా నిర్ణయించారు. ఫీజును క్రెడిట్‌, డెబిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. పరీక్ష తేదీలు : సెషన్‌ 1: జనవరి 21 నుంచి 30, 2026 వరకు,సెషన్‌ 2: ఏప్రిల్‌ 1 నుంచి 10, 2026 వరకు, ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12, 2026

JEE మెయిన్‌ పేపర్‌–1 ద్వారా NITలు, IIITలు, ఇతర కేంద్ర సాంకేతిక సంస్థలు (CFTIs) మరియు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌ కళాశాలల్లో BE/BTech ప్రవేశాలు లభిస్తాయి.
పేపర్‌–2A (BArch) ద్వారా ఆర్కిటెక్చర్‌ కోర్సులకు, పేపర్‌–2B (BPlanning) ద్వారా ప్లానింగ్‌ కోర్సులకు ప్రవేశం లభిస్తుంది.ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు IITల్లో ప్రవేశం కోసం JEE అడ్వాన్స్‌డ్‌ రాయవచ్చు.

🔹 సిలబస్ వివరాలు

జాయింట్‌ NIT విడుదల చేసిన JEE మెయిన్స్‌ 2025 సిలబస్‌ ప్రకారం: గణితం (Maths): 14 యూనిట్లు, భౌతిక శాస్త్రం (Physics): 20 యూనిట్లు, రసాయన శాస్త్రం (Chemistry): 20 యూనిట్లుపేపర్‌–2A (BArch): గణితం 14 యూనిట్లు, డ్రాయింగ్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ భాగాలు ఉంటాయి.పేపర్‌–2B (BPlanning): మ్యాథమెటిక్స్‌ 14 యూనిట్లు, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2 యూనిట్లు, ప్లానింగ్‌ 3 యూనిట్లు ఉన్నాయి.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana