
Dnews 03: తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. బర్తరఫ్ చేస్తారా? అంటూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. బర్తరఫ్ చేస్తారా? అంటూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సురేఖను బర్తరఫ్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోద ముద్ర లభించగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చెన్నారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
