DNews:06 NOV:హైదరాబాద్‌: “మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు” అన్న సామెత ఇప్పుడు సాక్షాత్కారమైంది. నగరంలోని సంతోష్‌నగర్ ఐఎస్‌ సదన్‌లోని లక్కి హోటల్‌లో జరిగింది ఈ ఘోర సంఘటన.

బుధవారం ఓ వ్యక్తి ఆ హోటల్‌లో మటన్‌ బిర్యాని ఆర్డర్‌ చేసి తినడం మొదలుపెట్టాడు. తినే క్రమంలో ఒక ముక్కను తీసుకున్న సమయంలో బొద్దింక బయటకు రావడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆహారం తినడం ఆపి హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించాడు.

ప్రజల ఆరోగ్యాలతో ఇలా ఆటలు ఆడుతున్న హోటల్‌ యాజమాన్యంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధిక ధరలు వసూలు చేస్తూ, పరిశుభ్రత ప్రమాణాలను పాటించని హోటళ్లు పెరగడం పట్ల నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు ఫుడ్‌ సేఫ్టీ అధికారులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా, తరచూ తనిఖీలు చేసి నాణ్యత లేని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana