DNews:OCT 30:హైదరాబాద్/వరంగల్: మొంథా తుఫాను వల్ల గ్రేటర్ వరంగల్ పరిధిలో తలెత్తిన వరద బీభత్సం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్‌లో ఉండి జల్సాలు చేస్తే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

రాకేశ్ రెడ్డి హనుమకొండలోని జులైవాడలో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలతో పాటు అమరావతి నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్డులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ఉద్ధృతిని గ్రేటర్ వరంగల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

ప్రభుత్వంపై రాకేశ్ రెడ్డి విమర్శలు

రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మొంథా వరద బీభత్సంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక కాలనీలు నీట మునిగి, నగరం జల దిగ్బంధం అయిందని అన్నారు.తీవ్ర నష్టం వరదల్లో నిత్యావసర వస్తువులతో పాటు టీవీ, బీరువాలు వంటి విలువైన ఆస్తులు సైతం నీట మునిగి భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.ప్రజల కష్టాలు వృద్ధులు, వికలాంగులు, బాలింతలు రాత్రంతా నీటమునిగిన ఇళ్లలోనే గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యం తుఫాన్ తీవ్రతను ముందస్తుగా గ్రహించడంలో, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని మండిపడ్డారు.మంత్రులపై ధ్వజం “మొంథా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ముందస్తు చర్యలేవి? ఈ సమయంలో ఒక్క జిల్లాకు ఒక్కో మంత్రి ఇంచార్జీగా ఉండి వరద ప్రాంత ప్రజలకు రక్షణగా ఉండాలి. కానీ, మంత్రులు జల్సాల కోసం హెలికాప్టర్లు వస్తాయి, ప్రజలు ఆపదలో ఉంటే రావా?” అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో ఒక్కో మంత్రి ఒక్కో డివిజన్‌కు ఇంచార్జిగా ఉన్నారంటూ తీవ్రంగా విమర్శించారు.

తక్షణమే నీట మునిగిన ప్రాంతాల్లో ఆస్తి నష్టం అంచనా వేసి, బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సమ్మయ్య నగర్ పూర్తిగా నీట మునిగి ప్రజలు సర్వం కోల్పోయారని, వరదల్లో ఆవులు, గేదెలు వంటి పశువులు కొట్టుకుపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆస్తి నష్టంతో పాటు పశు పక్ష్యాదుల ప్రాణ నష్టం కూడా భారీగా వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana