DSports:OCT 30:బెర్లిన్: ప్రపంచ ఆర్థిక మందగమనం, డిమాండ్‌ తగ్గుదల ప్రభావం మరోసారి ఉద్యోగాలపై పడింది. జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పూమా మరియు అమెరికన్‌ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ ఉద్యోగులను తగ్గించే నిర్ణయం తీసుకున్నాయి.

పూమా బుధవారం కీలక ప్రకటన చేస్తూ, 2026 చివరి నాటికి 900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ ఏడాదిలోనే ఖర్చు తగ్గింపు కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 500 మందిని తొలగించినట్లు తెలిపింది. కొత్త సీఈఓ ఆర్థర్‌ హోయెల్డ్‌ ఆధ్వర్యంలో సంస్థ లాభదాయకతను మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

తాజా త్రైమాసిక నివేదిక ప్రకారం, పూమా అమ్మకాలు కరెన్సీ సర్దుబాటు ప్రాతిపదికన 10.4% తగ్గగా, లాభాలు అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, అమెజాన్‌ ఇండియాలో కూడా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, సంస్థ 800 నుంచి 1,000 మందిని తొలగించే ప్రణాళిక రూపొందించింది. ఆర్థిక, మానవ వనరులు, టెక్నాలజీ వంటి విభాగాలకు ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా అమెజాన్‌ కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచుతోంది. గ్లోబల్‌ టీమ్‌ల కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశముందని సమాచారం.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana