
D news 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంది-ప్రధాని మోదీ
భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2014 తర్వాత 40 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేశామని తెలిపారు. మన టెక్స్టైల్, ఫార్మా, మత్స్య సంపద రక్షిస్తోందన్నారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులపై భరోసా ఉందన్నారు. త్వరలో Next లెవెల్ రిఫామ్స్ జరగబోతున్నాయన్నారు మోదీ. సప్తధార శక్తితో దేశానికి మరింత ఊతమిస్తామన్నారు. సప్తధార శక్తిలో మొదటిది తయారీ శక్తి.. భారత్‌ని గ్లోబల్ సప్లై చైన్‌గా మార్చాలన్నారు.
గ్లోబల్ మార్కెట్లో మన వస్తువులు క్వాలిటీ ఉండాలన్నారు. సప్తధారలో రెండోది ఫుడ్ ప్రొడక్షన్, కెమికల్ ఫ్రీగా ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ ఉండాలన్నారు. సప్తధారలో మూడోది టెక్నాలజీ.. ఏఐ, డేటా సెంటర్స్‌లో ఇన్నోవేషన్ హబ్‌గా ఉండాలన్నారు. సప్తధారలో నాలుగోది గతిశక్తి.. దేశంలో ఫాస్ట్ కనెక్టివిటీ పెరగాలన్నారు. సప్తధారలో ఐదోది రక్షణ శక్తి డిఫెన్స్ రంగంలో భారత్ ఆత్మనిర్భర్‌గా ఎదగాలన్నారు. సప్తధారలో ఆరోది గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ సప్తధారలో ఏడోది యువశక్తి అన్నారు మోదీ.
