
DET:OCT31:
థియేటర్లో శక్తి శాలిని టీజర్‌ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన అనీత్ పడ్డా:
తాజాగా విడుదలైన శక్తి శాలిని సినిమా టీజర్‌ని థియేటర్లో చూసి నటి అనీత్ పడ్డా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది.దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఆమె సంతోషం చూసిన అభిమానులు కూడా తెగ మురిసిపోతున్నారు.సాయియారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీత్,ఇప్పుడు మ్యాడ్‌డాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
చిరునవ్వుతో,చప్పట్లతో మురిసిపోయిన అనీత్:
ఆయుష్మాన్ ఖురానా నటించిన తమ్మ సినిమా ప్రదర్శన సమయంలోనే,శక్తి శాలిని సినిమా టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శించారు.ఆ టీజర్ మొదలవ్వగానే,తన పేరు స్క్రీన్ మీద కనిపించగానే అనీత్ పడ్డా ముఖం సంతోషంతో వెలిగిపోయింది.ఆమె పెద్దగా నవ్వుతూ, ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది.ఈ వీడియోను ముంబైలోని ఒక థియేటర్లో ఆమె స్నేహితురాలు తీసి,ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అనీత్ ఆనందం చూసి మురిసిపోతున్న అభిమానులు:
ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారడంతో,అభిమానులు అనీత్పై ప్రేమను కురిపిస్తున్నారు.ఆమె ముఖంలో ఆ చిరునవ్వు అద్భుతం,ఈ క్యూట్‌నెస్‌ని తట్టుకోలేకపోతున్నా,నా హృదయాన్ని కరిగించింది,వావ్ లవ్లీ,ఆమె దీనికి అర్హురాలు.మేము ఆమెను చూసి గర్విస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కొందరు ఇది ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అహాన్ పాండే తీశాడేమో అని అనుకున్నారు,కానీ అది అనీత్ స్నేహితురాలు తీసిందని తెలిసింది.
డిసెంబర్ 2026లో శక్తి శాలిని విడుదల:
కియారా అద్వానీ ప్లేస్‌లో అనీత్ పడ్డా శక్తి శాలిని సినిమా లీడ్ రోల్లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ టీజర్లో ఆమె పాత్రను రక్షకురాలు.విధ్వంసకురాలు.అందరికీ తల్లిగా పరిచయం చేశారు.ఈ సినిమా షూటింగ్ జనవరి 2026లో మొదలవుతుందని, వచ్చే ఏడాది క్రిస్మస్కు ఒక రోజు ముందు,అంటే డిసెంబర్ 24,2026న సినిమా విడుదల కానుందని సమాచారం.
