DSports 28Feb 2026:చెన్నై/కోల్‌కతా: టీ20 ప్రపంచకప్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి మరియు భావోద్వేగానికి గురి చేస్తోంది. తన తండ్రి మరణించిన మరుసటి రోజే ఆయన తిరిగి జట్టుతో చేరాలని నిర్ణయించుకోవడం రింకూ వృత్తి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.

  • గత కొద్ది రోజులుగా రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు రింకూ అత్యవసరంగా తన స్వగ్రామమైన అలీగఢ్‌కు వెళ్లారు. దురదృష్టవశాత్తూ, శుక్రవారం (ఫిబ్రవరి 27) ఆయన తండ్రి కన్నుమూశారు.
  • తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే, రింకూ సింగ్ కుంగిపోకుండా దేశం కోసం ఆడేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం (మార్చి 1) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న ‘డూ ఆర్ డై’ (చావో రేవో) మ్యాచ్ కోసం ఆయన శనివారం సాయంత్రమే జట్టుతో చేరనున్నారు. తండ్రిని కోల్పోయిన 24 గంటల్లోనే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని ఆయన తీసుకున్న నిర్ణయం చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana