
DSports 8 Dec: న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్లు తిరిగి రాగా, కొందరు యువ ఆటగాళ్లపై సెలక్టర్లు వేటు వేశారు.
హార్దిక్ పాండ్యా, గిల్, బుమ్రా రీఎంట్రీ
గాయాల కారణంగా గత కొన్ని సిరీస్‌లకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మరియు పేస్ అటాక్‌కు నాయకత్వం వహించే జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ఇది జట్టు బలాన్ని గణనీయంగా పెంచనుంది.
స్టార్ ప్లేయర్‌పై వేటు – రింకూ సింగ్ అవుట్!
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, మ్యాచులను గెలిపించిన యువ సంచలనం రింకూ సింగ్పై వేటు పడింది. గాయం నుంచి హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో, ఫినిషర్ పాత్ర కోసం అతనికి చోటు దక్కలేదు. అలాగే, యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో స్థానం కోల్పోయారు.
