
DSports 31 Oct:ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత క్రికెట్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చల్లో ఒకటైన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (MI)ను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)లో చేరనున్నారా? అనే అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన పరిణామాలు, సోషల్ మీడియా పోస్టులు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
అభిషేక్ నాయర్ నియామకం: రోహిత్ శర్మకు అత్యంత సన్నిహితుడు, ఫిట్‌నెస్ ట్రైనర్, మెంటార్ అయిన అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులు కావడం.
కేకేఆర్ సోషల్ మీడియా పోస్ట్: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం సాధించినందుకు కేకేఆర్ అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేసింది. దానికి ఒక అభిమాని “అయితే కన్ఫామ్ అనుకోవచ్చా..?” అని కామెంట్ చేయగా, కేకేఆర్ “నంబర్ 1 వన్డే బ్యాటర్ కన్ఫామ్” అంటూ సమాధానం ఇచ్చింది. ఈ సంభాషణ రోహిత్ కేకేఆర్‌లో చేరబోతున్నారనే చర్చకు దారితీసింది.
