
D Educt: Sept 15: 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయనున్నారు.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాలను మెరిట్ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల అకడమిక్ పనితీరు, ఉన్నత విద్యాభ్యాసం, సర్వీసు అనుభవం, గ్రాడ్యుయేషన్ తర్వాత సీనియారిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందించనున్నారు.
ఈ మేరకు వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సెప్టెంబరు 13న ఉత్తర్వులు జారీ చేశారు. తొలిసారిగా APPSC ద్వారా ఈ పోస్టుల భర్తీ చేపట్టనుండటంతో వెటర్నరీ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి.
