DSports 31 Oct:లండన్ ఒలింపిక్స్ 2012లో షూటింగ్ క్రీడలో రజత పతకం సాధించి దేశానికి పేరు తెచ్చిన విజయ్ కుమార్, కోచ్‌ల ఎంపికలో తనకు అవకాశం ఇవ్వనందుకుగాను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)ను ఆశ్రయించారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తనను విస్మరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విజయ్ కుమార్ పాత్ర 2012 లండన్ ఒలింపిక్స్ మెడలిస్ట్, షూటర్.నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ప్రకటించిన కోచ్‌ల ప్యానెల్‌లో విజయ్ కుమార్ పేరు లేకపోవడంఈ విషయంపై వివరణ లభించకపోవడంతో, గత నెలలో (సెప్టెంబర్) విజయ్ కుమార్ తన సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ, తన కేసును వివరిస్తూ PMOకు లేఖ రాశారు.విజయ్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించిన PMO, అక్టోబర్ 13న తదుపరి చర్యల కోసం దాన్ని జోగిందర్ సింగ్ (అండర్ సెక్రటరీ, భారత ప్రభుత్వం)కు పంపింది.

విజయ్ కుమార్ ఆవేదన:

కోచ్‌గా తనను ఎంపిక చేయకపోవడం వెనుక కారణాలను తెలుసుకోవడానికి తాను NRAI సెక్రటరీ జనరల్ మరియు సెలక్షన్ కమిటీ సభ్యులను సంప్రదించినప్పటికీ, సంతృప్తికరమైన సమాధానం రాలేదని విజయ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

“కోచ్‌లుగా ఎంపికైన వారిలో చాలా మంది అద్భుతమైనవారు మరియు అంతర్జాతీయ షూటర్‌గా నా రెండు దశాబ్దాల కెరీర్‌లో సహచర ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ, ఎంపిక కాకపోవడంపై కారణం గానీ, స్పష్టత గానీ లేదు” అని 40 ఏళ్ల విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

కోచ్ ఎంపిక ప్రక్రియలో తనను ఇంటర్వ్యూ చేసినప్పటికీ, తనకు స్థానం దక్కకపోవడం “తీవ్ర అవమానకరం మరియు బాధాకరం” అని అన్నారు.

NRAI ప్రెసిడెంట్‌కు మెసేజ్‌లు మరియు ఈమెయిల్‌లు పంపినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో, చివరకు PMO మరియు క్రీడా మంత్రిత్వ శాఖను ఆశ్రయించడం తన చివరి ప్రయత్నం అని ఆయన తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana