D Educt: Oct 29: నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష: 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST) రాసే విద్యార్థులకు సంబంధించి హాల్‌టికెట్లు (అడ్మిట్‌ కార్డులు) అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. నవంబర్‌ 28న ప్రవేశ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అవసరం.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం

విద్యార్థులు ముందుగా నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ navodaya.gov.in లేదా సంబంధిత దరఖాస్తు పోర్టల్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే “ఆరవ తరగతి JNVST ప్రవేశ పత్రాన్ని (Admit Card) డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి” లింక్‌పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (Registration Number), పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి. స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి, Submit లేదా Sign In బటన్‌పై క్లిక్‌ చేయాలి.

వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత హాల్‌టికెట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్‌ తీసి భద్రపరుచుకోవాలి. పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్‌టికెట్‌ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పరీక్ష తేదీ, సమయం, కేంద్రం వంటి వివరాలను హాల్‌టికెట్‌లో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.