
D News: ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ‘మిర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన జోరు చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు తమకు గుర్తింపు తెచ్చిన పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది.
విడుదలైన తొలి రోజే మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజుకు మరింత పుంజుకుంది. ఆదివారం సెలవు కావడంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక పెరిగింది. దీంతో మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.96.85 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో రూ.100 కోట్ల మార్క్‌కు సినిమా మరింత చేరువైంది.
ముఖ్యంగా కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి మరోసారి తన మార్క్ చూపించగా.. గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్, మున్నాగా దివ్యేందు కనిపించడం ‘మిర్జాపూర్’ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ పాత్రలను మళ్లీ పెద్ద తెరపై చూడటంతో ఫ్రాంచైజీ అభిమానుల్లో మంచి స్పందన కనిపిస్తోంది.
మరోవైపు తెలుగు వెర్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. తొలి మూడు రోజుల్లో తెలుగు వెర్షన్ రూ.84 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు పరిమిత స్పందనే లభిస్తోంది.
తెలుగు మార్కెట్లో సినిమాకు తగిన స్థాయిలో ప్రచారం జరగకపోవడం కూడా వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడంతో తెలుగు వెర్షన్‌కు పెద్దగా బజ్ ఏర్పడలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా దూసుకెళ్తోంది. సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.
