D News: తాతా మధు సస్పెన్షన్పై మంత్రి సీతక్క కీలక డిమాండ్ చేశారు. స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే ఆయన్ను బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి

స్పీకర్‌ను దూషించిన తాతా మధుపై చర్యలు తీసుకోవాలని సీతక్క అన్నారు. ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాతా మధును బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ బహిష్కరించాలని కోరారు.

ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్

బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని కూడా ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్నారని సీతక్క విమర్శించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రాకుండా అక్కడే సమావేశాలు పెట్టడం ఫామ్‌హౌస్ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

అసెంబ్లీకి రాకుండా బయట నిరసన ఎందుకు?

అసెంబ్లీ చట్టాలు చేసే పవిత్రమైన ప్రదేశమని సీతక్క అన్నారు. సభకు రాకుండా బయట నిరసన చేయడం ఎందుకని ప్రశ్నించారు. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ నిరసనకు దిగడాన్ని ఆమె తప్పుబట్టారు.

బీజేపీ, బీఆర్ఎస్‌పై సీతక్క తీవ్ర విమర్శలు

బీజేపీ, బీఆర్ఎస్‌లు డ్రామా కంపెనీలుగా మారాయని సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అసెంబ్లీ బయట, బీజేపీ అసెంబ్లీ లోపల డ్రామా చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు.

ప్రజా సమస్యల కంటే రాజకీయమే ముఖ్యమా?

ప్రతిపక్షాలకు ప్రజా సమస్యల కంటే రాజకీయాలు, ప్రచారమే ముఖ్యమని సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో నిబంధనలు పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ నిబంధనలను వారే ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana