
D News: Sept 12: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ఇండియా పోస్టు నోటిఫికేషన్ (Schedule-II, July-2026) విడుదల చేసింది.
ఈ నియామకాలను పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా చేపట్టనున్నారు. రాత పరీక్ష లేకుండానే మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పోస్టును బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
