
DET:NOV 03:
మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం:ఆరోగ్యానికి మంచిదా?
మనం తరచుగా వండిన ఆహారాన్ని పడేయడం ఇష్టం లేక,ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు వేడి చేసుకుని తింటుంటాం.ఇది సమయాన్ని,ఆహారాన్ని ఆదా చేసే మంచి అలవాటే అయినా,కొన్ని ఆహారాలను పదేపదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాక్టీరియా పెరిగే ముప్పు:
వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచినా, సరిగ్గా నిల్వ చేయకపోయినా,దానిలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.
ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాలు ఆహారాన్ని మళ్ళీ వేడి చేసినా పూర్తిగా నశించవు.దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్,వాంతులు,విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.ముఖ్యంగా,అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచి,మళ్ళీ వేడి చేస్తే,బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా వల్ల విషతుల్యంగా మారవచ్చు.
పోషకాలు నష్టం,విష రసాయనాల ఉత్పత్తి:
పాలకూర,ఆకుకూరలు:
వీటిలోని నైట్రేట్‌లు మళ్ళీ వేడి చేయడం వలన క్యాన్సర్ కారకాలుగా (నైట్రోసమైన్‌లుగా) మారే ప్రమాదం ఉంది.
బంగాళాదుంపలు:
వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే పెరిగే బ్యాక్టీరియా, వేడి చేసినా చనిపోదు.
మాంసాహారం చికెన్,గుడ్లు:
వీటిలోని ప్రోటీన్లు మళ్ళీ వేడి చేయడం వలన వాటి నిర్మాణం మారిపోయి,జీర్ణం కావడం కష్టమవుతుంది.
దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
