DNews: Nov22: హిడ్మా (మావోయిస్ట్ హిడ్మా).. దండకారణ్యంలో కీలక నాయకుడు. ఆయన స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పని అయిపోవాలి. ఇంత చురుకైన మావోయిస్టు నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.. ఆయన మరణంతో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో మరో కీలక మావోయిస్టు నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. హిడ్మా స్థానంలో మావోయిస్టు పార్టీకి కీలక నాయకుడు, టాప్ కమాండర్ అయిన బార్సీ దేవా రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. హిడ్మా స్వస్థలం పూవర్తి గ్రామానికి చెందిన బార్సీ దేవా.. 30 ఏళ్లకు పైగా దళంలో ఉన్నారు. హిడ్మాతో కలిసి అతను అనేక ఆపరేషన్లలో పాల్గొన్నట్లు సమాచారం. ఇకపై బార్సీ దేవా హిడ్మా పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ.. మావోయిస్టులు లేదా పోలీసులు అతనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బార్సీ దేవా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana