
DSports 23Mar 2026:చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ నగారా మోగకముందే చర్చలు మొదలయ్యాయి. జట్లు తమ సొంత వేదికలను (Home Grounds) మార్చుకోవడంపై టీమిండియా మాజీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఒకే సీజన్‌లో ఒక జట్టుకు రెండు వేర్వేరు హోమ్ గ్రౌండ్‌లు ఉండటం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తన తొలి మూడు హోమ్ మ్యాచ్‌లను జైపూర్‌లో కాకుండా అస్సాంలోని గువహటి (Barsapara Stadium) లో ఆడనుంది.
- అశ్విన్ వాదన: “ఒక జట్టుకు సీజన్ మొత్తం ఒకే హోమ్ గ్రౌండ్ ఉండాలి. సీజన్ మధ్యలో వేదికలను మార్చడం వల్ల జట్టుకు లభించాల్సిన ‘హోమ్ అడ్వాంటేజ్’ దెబ్బతింటుంది. ఇది ఆటగాళ్లకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది” అని అశ్విన్ పేర్కొన్నారు.
- రియాన్ పరాగ్ ఫ్యాక్టర్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత రాష్ట్రం అస్సాం కావడంతో అక్కడ అతనికి మద్దతు లభిస్తుందని బోర్డు భావిస్తోంది. దీనిపై స్పందిస్తూ, “పరాగ్‌కు అక్కడ మద్దతు ఉంటుందన్నది నిజమే, కానీ ఆడాలనుకుంటే సీజన్ మొత్తం అక్కడే ఆడండి.. అంతే తప్ప ఇలా వేదికలు మార్చడం సమంజసం కాదు” అని అశ్విన్ హితవు పలికారు.
