
D Educt: Sept 1: ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గడువు పొడిగింపు
రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గడువును సెప్టెంబరు 7 వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబరు 7 తర్వాత ప్రవేశాల గడువును ఇకపై పొడిగించే అవకాశం లేదని తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమకు నచ్చిన జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందాలని ఇంటర్‌బోర్డు సూచించింది.
