
D Educt: Aug 25: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ అడ్మిషన్ ప్రక్రియకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు కొనసాగనుంది.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 3 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 7న ఐసెట్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 8 నుంచి ఆయా కాలేజీల్లో తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.
